రెండవ తరగతి[Dec31st-1992]
వంట గదిలో
"అమ్మా అమ్మా...నిన్న అంత పూర్తిగా చదువుకున్నా అమ్మా...ఈ రోజు కూడా fullగా చదువుకుంటానమ్మా ...5 రూపాయలు ఇవ్వమ్మా...pls"
"5 రూపాయలా ఎందుకు బుజ్జి???"
"మరేమో మా friendsకి గ్రీటింగ్ కార్డ్స్ కొనాలి... pls అమ్మా...next సంవత్సరం నుంచి ఇంకా బాగా చదువుతా...first ర్యాంక్ ఖచ్చితంగా తెచ్చుకుంటా..."
"సరే...ఇంద తీసుకో...పిచ్చి పిచ్చి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోకు....ఒరేయ్ ఆగరా .పాలు తాగి పో..."
కిరానా కొట్టు....
"హ్మ్మ్మ్..హ్మ్మ్మ్మ్..చిరంజీవి గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయా ??? "
" అదిగో.. అక్కడ అందరి హీరోస్ వి ఉన్నాయి... ఏవి కావాలో తీసుకో... ఒక్కో గ్రీటింగ్ కార్డ్ పావల ... "
[రమణ కి,శరత్ కి,శ్రావణ్ కి చిరంజీవి కార్డ్స్,శేషుకి ఏమో క్రిష్ణ అంటే ఇష్టం సో క్రిష్ణ కార్డ్, కిషోర్ కి బాలక్రిష్ణ కార్డ్ ఇద్దాం.. ఇంకా మిగతా వాళ్ళకి వెంకటేష్ , నాగార్జునవి తీసుకుంటా ]
" అన్నా ఈ కార్డ్స్ అంతా కలిపి ఎంత ? " ...
" మూడు రూపాయలు"
" ఇంద తీసుకో... వ్రూం వ్రూం వ్రూం [నోటితో బండి శబ్దం చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవటం] ..... "
New Year Resolution : ఈ వయసు లో.. resolution తీసుకోవచ్చు అన్న ఐడియా కూడ ఉండకపోవచ్చు .. సొ నో Resolution ..
*************************************************************************************
ఎనిమిదవ తరగతి[Dec 31st-1998]
" అమ్మా.... ఒక 50 రూపాయలు ఇవ్వమ్మా... New Year కి గ్రీటింగ్ కార్డ్స్ కొనాలి .."
" ఒరేయ్... 50 రూపాయలా ... అంత ఎందుకు రా... ?? "
" ఒక్కో గ్రీటింగ్ కార్డ్ ఇప్పుడు 5-7 రూపాయలు అమ్మా.... friends చాలా మంది ఉన్నారు... వాళ్ళందరికి ఇవ్వాలి.. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపొతే.. ఫీల్ అవుతారు.... "
" అయినా సరే.. 50 రూపాయలు అయితే ఇవ్వను...ముందు బాగా చదివి ... first ర్యాంక్ తెచ్చుకో,...అప్పుడిస్తా... చిన్నప్పటి నుంచి ... ఒక్క సారి అయినా క్లాస్ first వచ్చావా??? "
" అబ్బ...first ర్యాంక్ తెచ్చుకుంటాన్లే... ముందు 50 రూపాయలు ఇవ్వమ్మా.... మా friends లో అందరికన్నా... నేనే ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి..."
" దీంట్లో ఎక్కువ ఇవ్వాలన్న కొరిక... మార్క్స్ లో ఎక్కువ రావలని లేదు.... వెధవ..... ఇదిగో... తీసుకో.... "
" అమ్మా... నాకు డబ్బులు ఇచ్చావని.. నాన్నకి చెప్పకు...... ఎందుకంటె.. నాన్న కూడా... 50 ఇచ్చాడు..... "
"ఓరి వెధవ.... ఆగరా.. టిఫిన్ తిని వెళ్ళు"
Archies గ్యాలరి
"అన్నా... Mario , Mogli గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి.... "
" అక్కడ ఆ మూల ఉన్నాయి బాబు"
[నా క్లోస్ friends కి Mario కార్డ్ ఇద్దాం... మిగత వాళ్ళకి ఏవో ఒక కార్డ్ ఇద్దాం లె.... ]
" అన్నాయ్.... 10 కార్డ్స్ .. తీసుకున్నా... 70 రూపాయలు అయ్యింది చూడు "
New Year Resolution: ఈ సారి ఎలాగైన....first ర్యాంక్ నాకే రావాలి...రోజూ పొద్దున్నె లేచి ఏ రోజు సబ్జెక్ట్ ఆ రొజే full గా చదివెయ్యాలి...
*************************************************************************************
Engg. [Dec 31st 2004]
" మా... మా.... అమ్మోవ్.. ఎక్కడ ఉన్నావ్.... "
" ఏంట్ర అలా అరుస్తావు.. ఇక్కడ వంట గదిలో ఉన్నా... "
" అమ్మా ... ఒక 500 కొట్టు.... New Year పార్టీ ఉంది..... "
" పార్టియా ??? నాన్న వాళ్ళ బ్యాంక్ లో ఈ రోజు పార్టి ఉందంట... అక్కడికి వెళ్దాం... "
" అమ్మా pls మా.... మా friends తో పార్టీ చేసుకుంటా.... మీతో వస్తే నాకు అక్కడ బోర్ కొడుతుంది,... నాకు ఎవ్వరూ తెలియదు కూడా... అమ్మా pls డబ్బులు ఇవ్వు..."
" ముందు .. నీ arrears ని క్లియర్ చెయ్యరా... తరువాత పార్టీ అయిన,...ఏదైనా ... "
" ఈ సంవత్సరం అన్నీ క్లియర్ చెస్తానే.. ముందు ఈ టైం లో ... నీ నస ఆపి.... డబ్బులు ఇవ్వు.... "
"ఇదిగో... తీసుకో,.... జాగ్రత్తగా వాడుకో... మీ నాన్నకు చెప్పకు నేను ఇచ్చానని... నిన్ను గారాం చేసి నేనే చెడగొడుతున్నానంటాడు.... "
"సరే.. చెప్పన్లే.... "
Place మీరే కనిపెట్టండి :)
" బాసూ!!..... పది బీర్లు..... 3 తందూరి చికెన్ పార్సల్ కట్టమ్మ... "
" అరేయ్ రాజు గా.... శీను గాడికి ఒక్క బీర్ చాలు రా... ఒక్కటి తాగగానె... omleT ఎలాగో వేస్తాడు... :"
అయితె 9 బీర్లు చాలమ్మ... "
"అరేయ్ రాజు గా రాత్రి పబ్ కి వెళ్దామా??? "
" ఊ... వెళ్దాం రా.... అరెయ్ శీను గా.. అందరి దగ్గర మనీ కల్లెక్ట్ చెయ్యరా.... పబ్ లో ఖర్చు అవుతుంధి గా
New Year Resolution : దేవుడా... ఈ ఇయర్ అయిన నా arrears అన్నీ క్లియర్ చేసేసి... స్వప్న నా ప్రేమ ని ఒప్పుకొనే లాగా చెయ్యి [ఇది మాత్రం తప్పనిసరి అమ్మ ... arrears ఉన్నా సరే ]
*************************************************************************************
ఫోన్ లో... ఆఫీస్ నుంచి [Dec 31st-2008]
"అమ్మా... ఈ రోజు రాత్రి నాకు ఫోన్ చెయ్యకండి... నా ఫోన్ silent mode లో ఉంటుంది.. రాత్రి US Client తో conference లో ఉంటాను..."
"అరేయ్ నాన్న... ఈ రోజు అయిన... rest తీసుకోరా..... వేళకు బాగా తిను.... "
"అమ్మా మళ్ళి మట్లాడత... కాస్త పని ఉంది బిజి గా ఉన్నా.... bye ....take care.."
New Year Resolution : ఈ సంవత్సరం అన్నా GMAT రాసి... MBA చెయ్యాలి..... ఈ software ఉద్యోగం... కన్నా management కోర్సు లో అవకాశాలు బాగుంటాయి.. జీతం తొ పాటు...
*************************************************************************************
పైన చెప్పిన సందర్భాలన్ని... అందరి జీవితాలలో తీపి గుర్తులు......
ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం అనేసరికి ... కొత్త కొత్త resolutions.. కొత్త ఆలోచనలు... కొత్త భావాలు...
'అవకాశం' అనే పుస్తకంలో ఉన్నా ఖాళీ పేజీలను ఆశ అనే సిరా తో నింపుకుందాము.
గత సంవత్సరంలో సాధించలేని విజయాలు,,ఈ సంవత్సరంలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..!!!
మీ
రాజేంద్ర
Tuesday, January 6, 2009
Subscribe to:
Post Comments (Atom)

భలే రాసారు ... నా చిన్నపటి రోజులు గుర్తువచ్చాయి :) గ్రీటింగ్స్ కి అమ్మను డబ్బులదగడం వగైరా లాంటివన్న మాట /... మీ బ్లాగు కూడలికి జత చేసారా ???
ReplyDeleteఇది చాలా సార్లు నాకు అనుభవమే.అద్భుతం గా వ్యక్తపరిచారు.
ReplyDeleteనేస్తం గారు!!
ReplyDeleteమీ లాంటి వారు నా టప గురించి కామెంటారంటే..ఎంత సంతోషంగా ఉందో..కించిత్ గర్వం కూడ సుమండి...:)
ఎప్పుడో జనవరి 1,2009 నాడు ఆవేశంగా ఈ సంవత్సరం నుండి మనము
బ్లాగులు రాయాలనుకొని(NEW YEAR RESOLUTION అనుకోండి)
అప్పుడు రాసిన టప ఇది...కాని మళ్ళి కంటిన్యూ చెయ్యలేక పోయాను.కాబట్టి కూడలికి జత చేసానో లేదో కూడ తెలియదు...:(
థ్యాంక్స్ రాధిక గారు...:)
ReplyDeleteమల్లీ ఓ మారు జత చేసేయండి.. ఓ పని అయిపోతుంది :)
ReplyDeleteమళ్ళీ ఒక సారి నా పాత mails అన్ని చూసుకున్నాను...కూడలిలో జత చేసానండోయి...:)
ReplyDeletesuperb rajendra gaaru.....
ReplyDelete